సుమారు రెండు శతాబ్దాల క్రితంనాటి ఓ విస్కీ బాటిల్ రికార్డు ధరకు అమ్ముడుపోయింది. 1760లో తయారు చేసిన ఈ విస్కీ బాటిల్‌ను అమెరికాకు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్ అనే సంస్థ వేలం వేసింది. జూన్ 30న జరిగిన ఈ వేలంలో ఈ బాటిల్‌ను మన్‌హట్టన్‌కు చెందిన ది మోర్గాన్ లైబ్రరీ రూ.1.02 కోట్లకు సొంతం చేసుకుంది. 19వ శతాబ్దంలో ప్రసిద్ధ పైనాన్షియర్ మోర్గాన్ ఈ బాటిల్‌ను కొనుగోలు చేయగా, ఆయన మరణానంతరం, దక్షిణ కరోలినా గవర్నర్ జేమ్స్ బైర్నస్‌కు, అక్కడి నుంచి ఆ బాటిల్ స్కిన్నర్ ఇంక్ స్థంకు చేరింది.