Skip to main content

Namaste NRI

గొప్ప స్ఫూర్తిని ఇచ్చే చిత్రమిది : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం అల్లూరి. కయాదు లోహర్‌ నాయికగా నటించింది. ప్రదీప్‌ వర్మ దర్వకత్వం వహిస్తున్నారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్‌ నిర్మస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈ నెల 23న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల  కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ ఇదొక పోలీస్‌ స్టోరీ. అల్లూరి అనే ఫిక్షనల్‌ పాత్ర తీసుకొని కొన్ని యధార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దాం. ఒక పోలీస్‌ విధిలో చేరినప్పటి నుండి 15 ఏళ్ల సర్వీస్‌లో ఏం చేశాడనేది ఒక అద్భుతమైన టైమ్‌లైన్‌ ఇందులో చూపించబోతున్నాం. దర్శకుడు ప్రదీప్‌ వర్మ పూర్తి కథతో నా దగ్గరికి వచ్చారు. ఈ కథలో సంఘటనలు నిజంగా జరిగినవేనని సినిమా చేస్తున్న క్రమంలో ఒక్కొక్కటిగా తెలిసింది. ఈ కథ విన్నప్పుడు పోలీస్‌ వ్యవస్థలో ఇంత డెప్త్‌ ఉందా అనిపించింది. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీగా ఉంటూ విధిని నిర్వహించే ఓ పోలీస్‌ కథ ఇది. వ్యవస్థలో మంచి, చెడులు ఇందులో చూపిస్తాం.  చెడుకి పరిష్కారం కూడా చూపిస్తాం. అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది అన్నారు.

Social Share Spread Message

Latest News