Skip to main content

Namaste NRI

నిజమైన ప్రేమకు అర్థం చెప్పే చిత్రమిది : స్వామి పట్నాయక్‌

రాజేష్‌ కొంచాడా, శ్రావణి శెట్టి జంటగా నటించిన చిత్రం కౌసల్య తనయ రాఘవ. స్వామి పట్నాయక్‌ దర్శకుడు. అడపా రత్నాకర్‌ నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నిజమైన ప్రేమకు అర్థం చెప్పే చిత్రమిది. 1980 సంవత్సరం గ్రామీణ నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశం హృద్యంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యోగి రెడ్డి, సంగీతం: రాజేష్‌ తేలు, నిర్మాణ సంస్థ: ఏఆర్‌ మూవీ మేకర్స్‌, ప్రొడ్యూసర్‌: అడపా రత్నాకర్‌, దర్శకత్వం: స్వామి పట్నాయక్‌.

Social Share Spread Message

Latest News