Skip to main content

Namaste NRI

బోరిస్‌  జాన్సన్‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది.  ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్‌  జాన్సన్‌ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వం ఉన్న ఇద్దరు సీనియర్‌ మంత్రులు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. బోరిస్‌ నేతృత్వంలోని సర్కార్‌ సరైన రీతిలో నడవడం లేదని ఆ ఇద్దరు ఆరోపించారు. ప్రభుత్వాన్ని వీడడం బాధగా ఉందని, కానీ ప్రభుత్వాన్ని ఇలా కంటిన్యూ చేయలేమని రిషి సునాక్‌ తెలిపారు. ప్రభుత్వం సరైన విధానంలో నడపాలని, ఐటీతత్వంతో ఉండాలని ప్రజలు భావిస్తారని, కానీ జరగడం లేదన్నారు. బహుశా ఇదే తన చివరి మంత్రి పదవి అంటూ తన లేఖలో తెలిపారు. బోరిస్‌ జాన్సన్‌ సామర్థ్యంపై తనకు నమ్మకం పోయినట్లు జావెద్‌ తెలిపారు. బోరిస్‌ నాయకత్వంలో పరిస్థితులు మారవని స్పష్టం అవుతోందని, అందుకే నమ్మకం సడలినట్లు తెలిపారు. ఇద్దరు కీలక మంత్రుల రాజీనామా నేపథ్యంలో ప్రధాని బోరిస్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Social Share Spread Message

Latest News