కువైత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెసిడెన్సీ వీసాల విషయంలో ఆరు నెలలపాటు దేశం వెలుపల ఉన్న వారి వీెసాలను రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఎవరైనా ఆర్టికల్ 18 ప్రకారం ( ప్రైవేట్ రంగం) రెసిడెన్సీ వీసాలు పొంది, తర్వాత 6 నెలల పాటు కువైత్ వెలుపల ఉంటే సదరు వ్యక్తుల రెసిడెన్సీ పర్మిట్లు నవంబర్ 1 నుంచి రద్దు చేయాలని రెసిడెన్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ డిసైడ్ అయింది. దీని ప్రకారం మే 1వ తేదీకి ముందు దేశాన్ని వీడిన వ్యక్తులు నవంబర్ 1వ తేదీలోపు కువైత్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో సదరు వ్యక్తుల రెసిడెన్సీ పర్మిట్లు రద్దు కానున్నాయి.














