Skip to main content

Namaste NRI

అమెరికాలో ఖ‌మ్మం విద్యార్థికి క‌త్తి పోటు

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చ‌దువుకుంటున్న భార‌తీయ విద్యార్థి ని క‌త్తితో పొడిచారు. ఆ 24 ఏళ్ల విద్యార్థి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంది. ఖ‌మ్మం జిల్లాకు చెందిన వ‌రుణ్ అనే విద్యార్థి త‌ల‌భాగంలోకి జోర్డాన్ ఆండ్రాడ్ క‌త్తితో అటాక్ చేశాడు.ఇండియానాలోని వ‌ల్ప‌రైసో సిటీలో ఉన్న ఓ జిమ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే దాడికి గ‌ల కార‌ణాల గురించి అధికారులు విచారిస్తున్నారు. అటాక్ తర్వాత దాడి చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. హ‌త్యాయ‌త్నం కింద కేసు బుక్ చేశారు. ఫోర్ట్ వెయిన్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌ కు చికిత్స అందిస్తున్నారు. వ‌రుణ్ కండీష‌న్ సిరీయ‌స్‌గా ఉంద‌ని, అత‌ను బ్ర‌తికే ఛాన్సు కేవ‌లం 5 శాత‌మే ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.తనను అంతం చేయనున్నట్లు మెసేజ్ రావడంతో నిందితుడు ఆండ్రాడ్ పబ్లిక్ జిమ్‌లోకి వెళ్లాడని, వరుణ్‌ను చూసి అతనే తనను చంపనున్నట్లు భావించి అతడిని కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.

Social Share Spread Message

Latest News