Skip to main content

Namaste NRI

అరుదైన ఘనత సాధించిన భారత సంతతి వ్యక్తి

అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌మ్యాన్‌గా పని చేస్తున్న భారత సంతతి వ్యక్తి అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన దర్శన్‌ షా ప్రస్తుతం అమెరికా వైమానికి దళంలో ఎయిర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22న మొదటి సారిగా నుదుటిపై తిలకం పెట్టుకుని విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆయనకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శన్‌ షానే వెల్లడిరచారు. నుదుటిపై తిలకం పెట్టుకుని అంశం గురించి ట్రైనింగ్‌ స్కూల్‌లో ఉండగానే అధికారులతో సంప్రదించినట్లు తెలిపారు. అయితే డ్యూటీలో చేరిన తర్వాత అక్కడి అధికారులను సంప్రదించాలని సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే డ్యూటీలో జాయిన్‌ అయిన తర్వాత ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించినట్టు చెప్పారు.

Social Share Spread Message

Latest News