Skip to main content

Namaste NRI

వైద్య చరిత్రలో అద్భుత ఘట్టం… మనిషికి

వైద్య చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. జన్యుపరంగా మార్పులు చేసిన రెండు పంది గుండెలను మనుషులకు అమర్చడంలో అమెరికా వైద్యులు విజయవంతమయ్యారు. న్యూయార్క్‌లోని లాంగ్‌వన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఆపరేషన్‌ చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఇద్దరు రోగులకు ఈ గుండెల్ని అమర్చామని, గుండెల పనితీరు సాధారణంగానే ఉన్నదని తెలిపారు. పంది గుండె మనిషికి అమర్చడం ఈ ఏడాది రెండోసారి. మేరీల్యాండ్‌లో గత జనవరిలో ఓ పేషెంట్‌కు ఈ తరహా చిక్సిత చేశారు. అయితే రెండు నెలల తర్వాత గుండెలో పందికి చెందిన డీఎన్‌ఏ వైరస్‌ అలాగే ఉండిపోయినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ రోగి మరణించాడు.

Social Share Spread Message

Latest News