Skip to main content

Namaste NRI

ఆఖరి నిమిషంలో అమెరికాకు తప్పిన ముప్పు

ఆఖరు నిమిషంలో అగ్రరాజ్యం అమెరికాకు షట్‌డౌన్‌ ముప్పు తప్పింది. స్పీకర్‌ కెవిన్‌ మెక్‌ కార్తీ ప్రత్యేక చొరవ తీసుకుని, మొండి వైఖరి వ్యవహరిస్తున్న రిపబ్లికన్లతో జరిపిన చర్చలు ఫలించాయి. ఫలితంగా వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆఖరు నిమిషంలో ఆమోదం లభించింది. మొత్తంగా బిల్లుకు 335 మంది అనుకూలంగా,  91 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆఖరు నిమిషంలో ప్రతినిధుల (దిగువ) సభలో ద్రవ్య బిల్లు పాసైంది. దీంతో 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందులు లేకుండా పోయాయి.

అమెరికాలో ఆర్థిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్యబిల్లు ఆమోదం తప్పనిసరి. అక్టోబర్ 1(ఆదివారం) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి లోపు ఈ బిల్లు పాసవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అక్టోబర్ 1న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ ఉద్యోగులకు వేతనాలు, వివిధ పథకాలకు నిధులు అందించడం సాధ్యమవుతుంది. లేదంటే అన్నీ స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

Social Share Spread Message

Latest News