Skip to main content

Namaste NRI

అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో ప్యాసింజర్‌ వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో జెలెన్‌స్కీ తీవ్రమైన గాయాలేవీ కాలేదని, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని జెలెన్‌స్కీ  ప్రతినిధి సెర్హీ నైకిఫొరోవ్‌ తెలిపారు. జెలెన్‌స్కీ రాజదాని కీవ్‌లో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్‌ కారు వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుతో పాటు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది. అయితే జెలెన్‌స్కీకి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అధ్యక్షుడితో పాటు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కు వైద్యులు చికిత్స చేశారు. అనంతరం జెలెన్‌స్కీని అంబులెన్సులో తరలించామన్నారు. జెలెన్‌స్కీని పరిశీలించిన వైద్యులు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతారన్నారు. హత్యాయత్నమా లేదా ప్రమాద వశాత్తు జరిగిందా అనే విషయం విచారణలో తేలుతుందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News