Namaste NRI

ఈ సమ్మర్‌కు సరైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌… గం గం గణేశా

ఆనంద్‌ దేవరకొండ  హీరోగా నటిస్తూ చిత్రం గం గం గణేశా.  ఈ చిత్రానికి ఉదయ్‌శెట్టి దర్శకుడు. కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ వేడుకలో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడారు.  నాకు కొంచెం కాన్ఫిడెన్స్‌ తక్కువ. అందుకే చుట్టూవున్న వాళ్ల దగ్గర నుంచి తీసుకుంటూ వుంటా. బేబీ చేసేటప్పుడు సినిమా ఎలా వస్తుంది? అని సాయిరాజేశ్‌, ఎస్‌కేఎన్‌, మారుతిగార్లకు పదే పదే కాల్‌చేసి అడిగేవాడ్ని. నువ్వు చేస్తున్న సినిమా సాధారణమైనది కాదు. ఈ సినిమాతో నీ కెరీర్‌ మారిపోతుంది  అని ఓరోజు మారుతి చెప్పారు. ఆయన అన్నదే జరిగింది.ఈ సినిమా విషయంలోనూ అలాగే దర్శకుడు ఉదయ్‌ని పదేపదే ఫోన్లు చేసి విసిగించేవాడ్ని. నిన్న సంబంధంలేని కొందరు యూత్‌కి గం గం గణేశా  స్పెషల్‌ షో వేసి చూపించాం. వాళ్లంతా సూపర్‌గా ఎంజాయ్‌ చేశారు. అప్పుడు నమ్మకం కుదిరింది. ఈ సమ్మర్‌కు సరైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గం గం గణేశా అన్నారు.   

అతిథిగా విచ్చేసిన రష్మిక మందన్నా మాట్లాడుతూ ఆనంద్‌ నాకు ఒక బ్రదర్‌. తనకి తెలీదు, తనపై నేను చాలా డిపెండ్‌ అవుతుంటా. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఆనంద్‌ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వే నేను కోరుకునేది. అందుకే ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ కావాలి అని ఆశాభావం వెలిబుచ్చింది. చిత్ర యూనిట్‌ సభ్యులతోపాటు నిర్మాత బన్నీవాసు, దర్శకుడు సాయిరాజేశ్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌, డైరెక్టర్‌ అనుదీప్‌ కె.వి, మధుర శ్రీధర్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events