Skip to main content

Namaste NRI

రష్మిక మందన్నకు అరుదైన ఘనత … ఫోర్బ్స్‌ జాబితాలో చోటు

కన్నడ సోయగం రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌ 30 జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న 30 ఏళ్ల లోపు ప్రతిభా వంతుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేయగా, అందులో రష్మిక మందన్న అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.

Social Share Spread Message

Latest News