Namaste NRI

రష్యాకు ఎదురుదెబ్బ.. మేజర్‌ జనరల్‌ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ హతం ?

రష్యా` ఉక్రెయిన్‌ వార్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు వస్తుండగా తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో రష్యా మేజర్‌ జనరల్‌ ఆండ్రీ సుఖోవిట్స్‌స్కీ మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంది. రష్యా సెంట్రల్‌ మిలటరీ కేంద్రంలో డిప్యూటీ కమాండర్‌గా ఉన్న ఆండ్రీ సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన సన్నిహితుడు తెలిపినట్లు వెల్లడిరచింది.

ఉక్రెయిన్‌లో జరుపుతోన్న సైనిక చర్యలో మేజర్‌ జనరల్‌ ఆండ్రీ ప్రాణాలు కోల్పోయారనే వార్త మమ్మల్ని ఎంతగానో కలచివేసిందంటూ ఆయన సన్నిహితుడు సామాజిక మాధ్యమల్లో పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి. రష్యా సైన్యంలో ప్లటూన్‌ కమాండర్‌ నుంచి వైమానిక దాడుల విభాగానికి అధిపతిగా ఆండ్రీ ఎదిగారని చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ అదే నిజమైతే రష్యా సైన్యానికి ఎదురుదెబ్బేనని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events