Namaste NRI

అమెరికా వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి

మంకీపాక్స్‌ వైరస్‌ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ)గా అమెరికా ప్రకటించింది. దీని వల్ల వైరస్‌ పై పోరాడేందుకు కావలసిన నిధులు, అదనపు సాధనాలు అందుబాటులోకి వస్తాయని  హెల్త్‌ సెక్రటరీ పేర్కొన్నారు.  అమెరికాలో మంకీపాక్స్‌ కేసులు 6,600కు పెరిగాయి. వైరస్‌ను ఎదుర్కోవడంలో మా స్పందనను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మంకీపాక్స్‌ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రతి అమెరికన్‌ను కోరుతున్నాం అని ఆరోగ్య శాఖ మంత్రి జేవియర్‌ బెసెర్రా ప్రకటించారు.  ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం వల్ల వైరస్‌ ఇన్ఫెక్షన్ల కేసుల వివరాల లభ్యత పెరుగుతుందని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌ రొచెల్లే వలెన్‌స్కీ సూచించారు.

Social Share Spread Message

Latest News