Skip to main content

Namaste NRI

అమెరికాలో కలకలం..నటుడు జానీ వాక్టర్‌ను

అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ హాలీవుడ్ నటుడు మరణించాడు. జనరల్ హాస్పిటల్ అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్నీ వాక్టర్ అనే నటుడిని దుండగులు కాల్చి చంపారు. 37 ఏళ్ల వయసున్న ఆయన కారులో ప్రయాణిస్తుండగా ఈ దారుణం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ జాన్నీ వాక్టర్ తన కారులో ప్రయాణిస్తున్నారు. అమెరికా లోని లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లో ఓ ముగ్గురు ఆగంతకులు అతని కారును వెంబడించినట్లు వాక్ట‌ర్ త‌ల్లి స్కార్లెట్ పోలీసులకు వివరించారు.

ముగ్గురు దుండగులు వాక్ట‌ర్ కారును వెంబడించి ఆపారు. కారులోని కాట‌లిక్ట్ క‌న్వ‌ర్ట‌ర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించారు. ఈ క్ర‌మంలో వాక్టర్ వారించాడు. దాంతో దుండ‌గులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఒక రౌండ్ కాల్పులు జరిపి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ వాక్ట‌ర్ ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన‌ట్లు తల్లి స్కార్లెట్ పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితులను తీవ్రంగా వెతుకు తున్నారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events