Skip to main content

Namaste NRI

లేటు వయసులో ఘాటు ప్రేమ.. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి  సిద్ధమైన  బిలియనీర్‌

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌  గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్  మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవా ను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు.  కాగా, ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వృద్ధ జంట వివాహం చేసుకోబోతోం దంటూ స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మార్దోక్‌ ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది.

జుకోవా రష్యాకు చెందిన రిటైర్డ్‌ మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌. మధుమేహం పరిశోధనలో స్పెషలిస్ట్‌. 1991లో మాస్కో నుంచి అమెరికాకు వెళ్లారు. మర్దోక్‌కు తన మూడో మాజీ భార్య డెంగ్‌ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో జుకోవా తో పరిచయం ఏర్పడిందట. డెంగ్‌కు 2013లోనే మర్దోక్‌ విడాకులు ఇచ్చేశాడు. జుకోవా గతంలో రెండు సార్లు రష్యన్‌ ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌ జుకోవ్‌తో పెండ్లి చేసుకున్నది. వారిద్దరికి ఓ కూతురు కూడా ఉన్నది. రూపర్ట్‌ మర్దోక్‌ నాల్గవ భార్య సూపర్‌ మోడల్‌ జెర్రీ హాల్‌. ఈమెకు 2022లో విడాకులు ఇచ్చాడు. మర్దోక్‌కు మొత్తం ఆరుగురు సంతానం ఉన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events