Namaste NRI

మాటా ఆధ్వర్యంలో విజయవంతంగా ఇఫ్తార్ విందు

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల రంజాన్ పవిత్రమాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసి మత సామరస్యం వెల్లివిరిసేలా చేసింది. అమెరికాలో ఉన్న తెలుగువారి ఐక్యత కోసం కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి మరీ కృషి చేస్తున్న మాటా సేవ, సంస్కృతి, సమానత్వం అనే తమ నినాదాన్ని మరోసారి నిరూపించుకుంది. మాటా ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న ఫ్లోరిడాలోని టెంపుల్ టెర్రస్‌లోని ఫోకస్ అకాడమీలో మొదటి ఇఫ్తార్ పార్టీని విజయవంతంగా నిర్వహించారు. ఈ ఇఫ్తార్ పార్టీలో వివిధ మతాలకు చెందిన 200 మంది ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పర్వదినం ప్రాముఖ్యత గురించి సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మాటా టీం టోనీ జన్ను, మన్సూర్ షేక్‌లను ఇంకా ఇతర సభ్యులను అభినందిచారు. ఈ సందర్భంగా మాటా అధ్యక్షులు శ్రీనివాస్ గనగోని అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఇఫ్తార్ విందులో జుబేర్ కాజిమి సాహిబ్, పాస్టర్ డాక్టర్ ప్రవీణ్ ఎర్నెస్ట్‌తో పాటు వివిధ కమ్యూనిటీ సంస్థల ప్రతినిధులతో సహా స్థానిక నాయకులు కూడా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events