Skip to main content

Namaste NRI

వందల ఏళ్ల తర్వాత బ్రిటన్ నుంచి … భారత్‌కు

ఛత్రపతి శివాజీ వినియోగించిన వ్యాఘ్‌ నఖ్‌ (పులిపంజా ఆకారంలో ఉండే ఆయుధం) భారత్‌కు వచ్చేసింది. లండన్‌ మ్యూజియం నుంచి తీసుకువచ్చినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి సుధీర్‌ ముంగంటి వార్‌ తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్ కు తీసుకువచ్చారు. ఈ వ్యాఘ్‌ నఖ్‌ను ఈ నెల 19 నుంచి మ్యూజియంలో ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నట్టు ఆయన చెప్పారు. 1659లో సతార యుద్ధంలో వ్యాఘ్‌ నఖ్‌ అయుధంతోనే బీజాపూర్‌ సుల్తాన్‌ అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ మట్టుబెట్టారు. వ్యాఘ్‌ నఖ్‌ను మహారాష్ట్రకు తీసుకురావడానికి 14.08 లక్షలు మాత్రమే వ్యయం చేసినట్టు సుధీర్‌ చెప్పారు. అయితే, అనేక ప్రయత్నాలు చేసిన మీదట, వందల ఏళ్ల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్ చేరుకుంది.

Social Share Spread Message

Latest News