Namaste NRI

అగ్రరాజ్యం ఎన్నికల్లో సత్తా చాటిన భారత మహిళ

అగ్రరాజ్యం అమెరికా సిటీ కౌన్సిల్‌ ఎన్నికల్లో భారత సంతతి చెందిన మహిళ మరోసారి సత్తా చాటారు. చార్లొట్టె సిటీ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో  ఇండియన్‌ అమెరికన్‌ డిరపుల్‌ అజ్మీరా విజయం సాధించారు. చార్లెట్టె కౌన్సిలర్‌గా వరుసగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో అజ్మీర్‌పై డెమొక్రాట్‌ బ్రాక్స్‌టన్‌ విన్‌స్టన్‌ పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. 2017లో తొలిసారిగా అజ్మీరా చార్లెట్టె సిటీ కౌన్సిల్‌  ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె.. సిటీ కౌన్సిల్‌కు కౌన్సిలర్‌గా ఎన్నికైన మొదటి ఆసియన్‌ అమెరికన్‌. అతిపిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందారు. గుజరాత్‌లో పుట్టి పెరిగిన అజ్మీరా తన తల్లిదండ్రులతో కలిసి 16 ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లారు.  సౌతర్న్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్‌ పొంది. లాస్‌ ఏంజెల్స్‌లో సీపీఏగా పని చేశారు.

Social Share Spread Message

Latest News