అజయ్ కతుర్వార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అజయ్ గాడు. భానుశ్రీ, శ్వేత మెహతా కథానాయికలు. అజయ్ కుమార్ ప్రొడక్షన్స్ పతాకంపై చందన కొప్పిశెట్టి టీమ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ రాగాల 24 గంటల్లో అలాంటి సిత్రాలు తరువాత పలు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించాను. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో త్వరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రంలో హీరోగా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం వుంది అన్నారు. త్వరలోనే టీజర్‌ని కూడా విడుదల చేస్తాం. ఈ కథలో అజయ్ ఎవరు? తన లక్ష్యం కోం ఏం చేశాడనేదీ కీలకం. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, మనీజేన, సుమంత్ బాబు, ప్రతీక్, నేపథ్య సంగీతం సిద్ధార్థ్ శివుని.














