Skip to main content

Namaste NRI

వాషింగ్టన్ డీసీలో అరాచకంపై అక్షర సమరం పుస్తకావిష్కరణ

తెదేపా సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు రచించిన అరాచకంపై అక్షర సమరం  పుస్తకాన్ని వాషింగ్టన్ డీసీలో ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుతో కలిసి రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాలను సునిశితమైన విమర్శలతో, పరిశీలనాత్మకంగా శోధించి వివిధ పత్రికలకు 200కు పైగా వ్యాసాలను రాయడం అభినందనీయమన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ వికృత రాజకీయాలకు పాల్పడుతున్న నేపథ్యంలో మన్నవ సుబ్బారావు ప్రజల గొంతుకై తన కలం ద్వారా గళం విప్పారన్నారు. నేర రాజకీయాల కబందహస్తాల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో తనవంతు పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సినీ దర్శకులు రాఘవేంద్రరావు  మాట్లాడుతూ మన్నవ సుబ్బారావు ప్రజల అంతరంగాన్ని శోధించి విశ్లేషించారని అన్నారు. వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన పాలన గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. హింస, వేధింపులు, అణచివేతలు చూశామని చెప్పారు. మానవ సమాజాన్ని సమూలంగా ధ్వంసం చేశారన్నారు. అందుకే ప్రజలు తిరగబడ్డారని తెలిపారు. ఇవన్నీ వ్యక్తిగత విషాదాలు కావని,  సామూహిక విషాదాలే అని ఆయన పేర్కొన్నారు. తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమానుష చట్టాలపై మన్నవ సుబ్బారావు క్షర సమరం చేశారని కొనియాడారు. జగన్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా క్రూరమైన అమానుష చట్టాలను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో భాను మాగలూరి, సుధీర్ కుమ్మి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News