Skip to main content

Namaste NRI

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అలా నిన్ను చేరి..కొడిపాయే లచ్చమ్మది సాంగ్ రిలీజ్

దినేష్‌తేజ్‌, హెబ్బాపటేల్‌ జంటగా నటించిన చిత్రం అలా నిన్ను చేరి. సురేష్‌ శివన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మాత. ఈ సినిమాలోని కోడిపాయే లచ్చమ్మది అనే గీతాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. ఈ తెలంగాణ జానపద గీతాన్ని మంగ్లీ ఆలపించింది. సుభాష్‌ఆనంద్‌ స్వరాల్ని సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ పాటలో హెబ్బాపటేల్‌ నృత్యం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్ర గీతాలన్నింటిని చంద్రబోస్‌ రచించారు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. చిత్రానికి సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా,  ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు.

Social Share Spread Message

Latest News