Skip to main content

Namaste NRI

ఘనంగా ఆలీ కూతురు వివాహం.. సందడి చేసిన సెలబ్రిటీలు

ప్రముఖ హాస్య నటుడు, కమెడియన్‌ ఆలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ, నాగార్జున`అమల దంపతులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి రోజాతోపాటు రాజకీ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా తన కూతురి పెళ్లికి రావాలంటూ ఆలీ భార్య జుబేదాను వెంటపెట్టుకుని ఇండస్ట్రీ మిత్రుల ఇంటికి వెళ్లి స్వయంగా శుభలేఖలు అందించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News