అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల సంబురాలు అంబరాన్ని తాకాయి. అమెరికన్లు వైదొలగానే తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. ఆనందోత్సాహాలతో కాబూల్‌లో బాణాసంచా పేల్చారు. ఎట్టకేలకు మా దేశాన్ని మేం సాధించాం. పూర్తిస్థాయి స్వాతంత్య్రం దక్కింది. ఆ దేవుడికి కృతజ్ఞతలు అంటూ తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. కాబూల్ ఎయిర్‌పోర్టును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. 20 ఏళ్ల యుద్ధం తర్వాత తాలిబన్లు మరింత బలమైన గ్రూపుగా తయారయ్యారు. అర్థరాత్రికి ఒక్క నిమిషం ముందుగా అమెరికా విమానం టేకాఫ్ అయిన వెంటనే తాలిబన్లు ఎయిర్‌పోర్టులోని వస్తున్న వీడియోలు బటయకు వచ్చాయి. యూఎస్ సేనలు చివరి విమానం బయలు దేరిన వెంటనే తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదో కీలక మార్పు అంటూ కేరింతలు కొట్టారు.