Skip to main content

Namaste NRI

అల్లరి నరేష్‌ హీరోగా ఉగ్ర ఆరంభం

అల్లరి నరేష్‌ హీరోగా దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో తాజాగా ఉగ్రం సినిమా షురూ అయింది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌ ఇచ్చారు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మొదటి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకుడి తల్లిదండ్రులు రామకోటేశ్వరరావు కనకమేడల, లోకేశ్వరి కనకమేడల స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందజేశారు. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌నీ విడుదల చేశారు. విజయ్‌ కనకమేడల మరోసారి శక్తివంతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  నరేష్‌ని మరోసారి విభిన్నమైన పాత్రలో ఆవిష్కరిస్తారు.  న్యూ  ఏజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది.సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఇతర నటీనటుల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  ఈ చిత్రానికి సంగీతం :శ్రీచరణ్‌ పాకాల, కెమెరా: సిధ్‌, కూర్పు : ఛోటా కె. ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ : బ్రహ్మకడలి, కథ, తూము వెంకట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events