Skip to main content

Namaste NRI

అమెరికా కే ఫస్ట్‌ ప్రాధాన్యం…ట్రంప్‌

చైనా, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు అపారమైన టారిఫ్‌ మేకర్లు అని అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇటువంటి పద్దతులను తమ ప్రభుత్వం ఎంతోకాలం కొనసాగనివ్వబోదన్నారు. అమెరికా ఫస్ట్‌ నినాదానికే తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇటువంటి పద్దతులను తన ప్రభుత్వం సుదీర్ఘకాలం అనుమతించబోదన్నారు. అమెరికాకు నష్టం చేసే దేశాలపై సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అయితే, బ్రెజిల్‌ బ్లాక్‌లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూడు దేశాలు (చైనా, భారత్‌, బ్రెజిల్‌) తమ దేశాల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. ఫ్లోరిడా రీట్రీట్‌లో హౌస్‌ ఆఫ్‌ రిపబ్లికన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ నిజంగా తమకు హాని చేసే దేశాలపై, ప్రజలపై సుంకాలు విధించబోతున్నాం. కానీ, ఆ మూడు దేశాల ప్రభుత్వాలు ఆయా దేశాలకు మంచి చేయాలని భావిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News