Skip to main content

Namaste NRI

తెలుగు ఉద్యోగులపై అమెరికన్‌ కంపెనీ వేటు

ఫానీ మే అనే అమెరికన్‌ కంపెనీ దాదాపు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో 200 మందిని నైతికత కారణాలపై కంపెనీ తొలగించింది. వీరిలో తెలుగువారే అత్యధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫానీ మేలో పనిచేస్తున్న వీరందరినీ నైతికత కారణంపై కంపెనీ తొలగించింది. మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ ప్రోగ్రామ్‌లో అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి వీరు పాల్పడినట్టు కంపెనీ అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది.

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) వంటి స్వచ్ఛంద సంస్థలతో కుమ్మక్కై కంపెనీ నిధుల దుర్వినియో గానికి పాల్పడినట్టు కంపెనీ ఆరోపిస్తోంది. ఇదే కుంభకోణానికి సంబంధించి యాపిల్‌ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కొందరు భారతీయ ఉద్యోగులను తొలగించడం గమనార్హం.

Social Share Spread Message

Latest News