కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్`కే జరిపిన వరుస బాంబు పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులు చేసింది. నాంగ్‌హార్ ప్రావిన్స్‌లో అమెరికా వాయుసేన ఈ మానవ రహిత వాయు దాడులకు దిగింది. తాము అనుకున్న లక్ష్యాన్ని ఛేధించినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ విలియం అర్బన్ తెలిపారు. ఈ దాడుల్లో కాబూల్ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం. కాబూల్ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతి చెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని స్పష్టం సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్ స్పష్టం చేశారు.