Skip to main content

Namaste NRI

 అమెరికా కీలక ప్రకటన… సెప్టెంబర్‌ 30 కల్లా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గ్రీన్‌ కార్డుల కోటా మొత్తాన్ని వినియోగించుకున్నట్టు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ శాఖ తాజాగా పేర్కొంది. సెప్టెంబర్‌ 30 నాటికి 2,81,507 ఉద్యోగ అధారిత గ్రీన్‌ కార్డులు జారీ అవుతాయని తెలిపింది. ఈ పరిణామంపై అమెరికాలోని వలస సేవల లాయర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో గ్రీన్‌ కార్డుల జారీకి సిద్ధమవడం సామాన్య విషయం కాదని ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు. సిబ్బంది, ఉన్నతాధికారులు విపరీతంగా శ్రమిస్తేనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఏటా జారీ చేసే గ్రీన్‌ కార్డుల కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో గ్రీన్‌ కార్డులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఏజెన్సీలు ఎన్నో అడ్డంకులను అధిగమించాయి అని తెలిపారు.

Social Share Spread Message

Latest News