Skip to main content

Namaste NRI

యాదాద్రికి దేవాలయానికి ప్రవాస భారతీయుడు కిలో బంగారం విరాళం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన యాదాద్రి దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి ప్రవాస భారతీయడు (ఎన్‌ఆర్‌ఐ) ఫైళ్ల మల్లారెడ్డి కిలో బంగారాన్ని విరాళంగా అందించారు. హైదరాబాద్‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌ రెడ్డికి బంగారు కోసం రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అదేవిధంగా కరోనా సమయంలో మల్లారెడ్డి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.కోటి, మిషన్‌ కాకతీయకు రూ.50 లక్షల విరాళం అందజేశారు. తన సొంత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా సుంకిశాలలో కళాశాల భవనం, ఆలయాలు నిర్మించారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  యాదాద్రి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News