Skip to main content

Namaste NRI

లండ‌న్‌లో రోడ్డు ప్ర‌మాదంలో భార‌త విద్యార్థిని మృతి

లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్థిని మృతి చెందింది. భారత పరిశోధక విద్యార్థిని చేష్టా కొచ్చర్‌ (33) లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి చేస్తున్నారు. కళాశాల నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ సెంట్రల్‌ లండన్‌లోని తన ఇంటికి వెళుతుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు సైకిల్‌ ను ఢీకొట్టింది. ఆ సమయం లో ఆమె భర్త ప్రశాంత్‌ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా,  తీవ్రగాయాలపాలైన కొచ్చర్‌ అప్పటికే మృతి చెందారు.  

గురుగ్రామ్‌లో నివాసముండే చేష్టా  సెప్టెంబరులోనే పీహెచ్‌డీ కోసం లండన్‌కి వెళ్లారు. గతంలో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్‌లోని నేషనల్‌ బహేవియరల్‌ ఇన్‌సైట్స్‌ యూనిట్‌లో సీనియర్‌ సలహాదారుగా సేవలందించారు. చేష్టా  మరణ వార్తపై నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ స్పందించారు. ఆమె మఅతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చేష్టా  ఎంతో దైర్య వంతురాలు. ఆమె నీతి ఆయోగ్‌ యూనిట్‌లో నాతో కలిసి పని చేశారు. ఇంత త్వరగా మన నుంచి దూరం కావడం బాధాకరం  అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News