Namaste NRI

రష్యా అధ్యక్షుడికి ఊహించని షాక్‌ 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు ఆయన్ని నిలదీసే పరిస్థితి చేరుకున్నారు. తమ వాళ్ల పేరిట కుటుంబాలకు ఇచ్చిన భద్రత హామీల అమలు ఏమయ్యిందంటూ, తమకు సమాధానం చెప్పాలంటూ అయిన్ని నిలదీస్తున్నారు.  రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో పుతిన్‌ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.  కొన్ని కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. అది ఊహించే ఈ సమావేశానికి వాళ్లను దూరంగా ఉంచారు. కేవలం అధ్యక్షుడు పుతిన్‌ కృతజ్ఞతలు తెలిపేందుకు కొన్ని  కుటుంబాలను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు అని రష్యా ఉద్యమవేత్త ఓల్గా సునకోవా తెలిపారు. అలాగే కొందరు మహిళలు పుతిన్‌ ముందర ఫిర్యాదులు చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుంతో అని భయపడి ఫిర్యాదు  చేయలేదని ఆమె అన్నారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events