Skip to main content

Namaste NRI

కల్కి నుంచి ఊహించని అప్‌డేట్‌ – కాశీ వీధుల్లో  భైరవ

ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం  కల్కి 2898 ఏడీ. భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ హంగుల తో దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకోన్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని తాజా అప్‌డేట్‌ వెలువడింది. భైరవ గా ప్రభాస్‌ పాత్ర పేరును పరిచయం చేస్తూ మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.  కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవను పరిచయం చేస్తున్నాం  అంటూ చిత్ర బృందం పేర్కొంది. ఇందులో ప్రభాస్‌ దృఢ కాయంతో అత్యంత శక్తివంతంగా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో భవిష్యత్తు కాశీ నగరం కనిపిస్తున్నది. ప్రభాస్‌ డ్రెస్సింగ్‌ ైస్టెల్‌, లుక్స్‌ విభిన్నంగా కనిపిస్తున్నాయి. మహాభారత కాలంలో మొదలై 2898 వరకు ఈ చిత్ర కథ నడుస్తుందని, మైథాలజీ ఫిక్షన్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News