Skip to main content

Namaste NRI

ఉస్తాద్ భగత్ సింగ్ లో మరో హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా నటించే అవకాశం దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో ఇప్ప‌టికే శ్రీలీల కథానాయిక‌గా న‌టిస్తుండ‌గా, మ‌రో క‌థానాయిక‌గా రాశీ ఖన్నా ఎంపికైనట్లు స‌మాచారం. అయితే ఇప్పటికే రాశీ షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టి, పవన్ కళ్యాణ్‌తో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events