Skip to main content

Namaste NRI

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… వీఐపీ దర్శనాలు బంద్‌

చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 31 వరకు వీఐపీలు ఆలయాలకు రావొద్దని సూచించింది. చార్‌ధామ్‌కు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాతురి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆలయాల 50 మీటర్ల పరిధిలో ఎలాంటి వీడియో లు తీయడం గానీ, రీల్స్‌ చేయడం వంటివాటిపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. చార్‌ధాయ్‌ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News