Skip to main content

Namaste NRI

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి  మృతి

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. భారత సంతతికి చెందిన సమీర్‌ కామత్‌ అనే 23 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని వారెన్‌ కౌంటీ పోలీసులు గుర్తించారు. సమీర్‌ ఇండియానా  రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీ లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. అతడికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. ప్రస్తుతం సమీర్‌ పీహెచ్‌డీ చేస్తున్నాడు. 2025లో తన పీహెచ్‌డీ పూర్తవ్వాల్సి ఉంది. ఇంతలోనే యూని వర్సిటీ సమీపంలో అతడు శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమీర్‌ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. సమీర్ మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా పూర్తైంది.

Social Share Spread Message

Latest News