Skip to main content

Namaste NRI

విరాట్ కోహ్లీకి మరో అరుదైన అవకాశం

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి మరో అరుదైన అవకాశం దక్కింది. ఇటీవల దుబాయ్‌లో కొత్తగా ప్రారంభించిన మేడం టసాడ్స్‌ మ్యూజియంలో టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారత పరిమిత ఓవర్ల జట్టు జెర్సీతో ఉన్న కోహ్లి బొమ్మ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్‌ను ఎత్తి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మేడం టూసాడ్స్‌ మ్యూజియంలో కోహ్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ దుబాయ్‌లో మ్యూజియంలో సచిన్‌తో పాటు ఫుట్‌బాల్‌ స్టార్లు రొనాల్డ్‌, మెస్సి, ఫార్ములా వన్‌ ప్రపంచ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ తదితర విగ్రహాలున్నాయి. ఇప్పుడు కోహ్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఢల్లీి, లండన్‌, దుబాయ్‌ మ్యూజియాల్లో అతని మైనపు బొమ్మలు కొలువుదీరినట్లుయింది.

Social Share Spread Message

Latest News