Namaste NRI

లైగర్‌ నుంచి మరో రొమాంటిక్‌ సాంగ్‌

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు  సంయుక్తంగా నిర్మించాయి. రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. కొనిస్తనే కోకా కోకా  2.0 అనే పాట విడుదల చేశారు. దీనికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. రామ్‌ మిరియాల,  గీతా మూధురి సంయుక్తంగా ఆలపించారు. పాటలో విజయ్‌, అనన్య  వేసిన భాంగ్రా స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో పూరి అతిథిలా తళుక్కువ మెరిశారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో తెరకెక్కిన యాక్షన్‌ చిత్రమిది. ఈ సినిమాకి కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మలయాళం భాషల్లో  ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News