Skip to main content

Namaste NRI

గౌతమ్‌ అదానీకి మరో ఎదురుదెబ్బ

గౌతమ్‌ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఇప్పటికే కెన్యా ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అదానీ కంపెనీతో మునుపటి హసీనా ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని సమీక్షించ నున్నట్టు తాజాగా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. విద్యుదుత్పత్తి ఒప్పందాలను సమీక్షించేందుకు లీగల్‌, ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నియమించాలని విద్యుత్తు, ఇంధనం, ఖనిజ వనరుల శాఖపై జాతీయ సమీక్షా కమిటీ సిఫారసు చేసిందని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ ప్రస్తుతం ఏడు మేజర్‌ ఎనర్జీ, పవర్‌ ప్రాజెక్టులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో అదానీ గ్రూప్‌ యాజమాన్యంలోని బీఐఎఫ్‌పీసీఎల్‌ 1234.4 మెగావాట్ల కంపెనీ కూడా ఉన్నట్లు వివరించింది.

Social Share Spread Message

Latest News