Skip to main content

Namaste NRI

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మరో ప్రపంచం

చక్ర ఇన్ఫోటైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కిలారు నవీన్‌ దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం మరో ప్రపంచం. వెంకట్‌ కిరణ్‌, సురైయ పర్విన్‌, యామిన్‌ రాజ్‌, అక్షిత విద్వత్‌, శ్రీనివాస్‌ నగర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ విడుదల చేశారు.  చిత్ర పోస్టర్‌ లుక్‌ను అతిథులు సాగర్‌ కె చంద్ర, సాయికిరణ్‌ అడివి విడుదల చేశారు. నిర్మాత వెంకటరత్నం మాట్లాడుతూ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. దాన్నే లీడ్‌గా తీసుకుని ఐదుగురు ప్యారలర్‌ మనుషుల మధ్య జరిగే కథగా మరో ప్రపంచం తీశాం అన్నారు.  డైరెక్టర్‌ నవీన్‌ మాట్లాడుతూ ప్యారలల్‌ యూనివర్సల్‌ కాన్సెఫ్ట్‌తో వస్తున్నాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌ కిరణ్‌, సురైయ పర్వీన్‌, అక్షిత, యామిన్‌, శ్రీనివాస్‌ సాగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శాండీ, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News