Skip to main content

Namaste NRI

కీవ్‌లో అంటోని బ్లింకెటన్ ఆకస్మిక పర్యటన

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అంటోని బ్లింకెన్‌ అకస్మాత్తుగా పర్యటించారు. ఉక్రెయిన్‌ సహా రష్యాతో ముప్పు పొంచి ఉన్న ఐరోపాలోని మరికొన్ని దేశాలకు రెండు బిలియన్ల డాలర్లకు పైబడి కొత్త సైనిక సహాయాన్ని బైడెన్‌ యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంత్కరించుకుంది.  పలువురు ఉక్రెయిన్‌ సీనియర్‌ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఉక్రెయిన్‌, దాని 18 పొరుగుదేశాలకు 2 బిలియన్‌ డాలర్ల విలువైన దీర్ఘకాలిక విదేశీ సైనిక రుణ సహాయాన్ని అందించాల్సిన అవసరాన్ని బైడెన్‌ పాలన యంత్రాంగం కాంగ్రెస్‌కు వివరించిందని బ్లింకెన్‌ వెల్లడిరచారు.  కాంగ్రెస్‌ నుంచి అనుమతి రావలసిన ఈ సహాయంలో 1 బిలియన్‌ డాలర్లు ఉక్రెయిన్‌కు దక్కుతాయి.

Social Share Spread Message

Latest News