Skip to main content

Namaste NRI

ప్రవాసీయుల సంక్షేమానికి ఏపీ ఎన్నార్టీ కృషి : అంజాద్ బాషా

రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలుగు వారంతా ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఉమ్రా చేయడానికి కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి సౌదీ అరేబియాకు వెళ్లారు. స్వదేశానికి తిరిగి రావడానికి ముందు జెద్ధాలో తనను కలిసిన సౌదీ అరేబియా తెలుగుఅసోసియేషన్ (సాటా)ప్రతినిధి బృందంతోఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారంతా భారతదేశ ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు. దేశంలో ఆదర్శవంతంగా చెప్పే కేరళ రాష్ట్రం కంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఏపీ ఎన్నార్టీ సంస్థ ప్రవాసీయుల సంక్షేమానికి కృషి చేస్తుందని చెప్పారు. సామాజిక సేవలో తమ పని తీరును సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వివరించగా ఉప ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శివ, సైమన్ పీటర్, రాంబాబు, ఫయాజ్, శాంతి ఉన్నారు.

Social Share Spread Message

Latest News