Namaste NRI

ఆర్య కొత్త ప్రాజెక్ట్ షురూ

తమిళ హీరో ఆర్య ఇప్పుడు ఓ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. ముత్తయ్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా జీ స్టూడియోస్, డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది ఆర్య నటిస్తున్న 34వ సినిమా. ఓ వినూత్నమైన కథతో చక్కటి వినోదాత్మక చిత్రంగా దీన్ని ముస్తాబు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆర్య మునుపెన్నడూ చేయని సరికొత్త పాత్రలో సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : జి.వి.ప్రకాష్, ఛాయాగ్రహణం : వేల్రాజ్.

Social Share Spread Message

Latest News