Skip to main content

Namaste NRI

ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా.. భారత సంతతి ఆర్థికవేత్త

ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా, డెవలప్‌మెంట్‌ ఎకనమిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా భారత సంతతి ఆర్థికవేత్త ఇందర్‌ మిత్‌ గిల్‌ నియమితులయ్యారు. ఆయన నియామకం వచ్చే సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. వివిధ దేశాల సూక్ష్మ ఆర్థిక అసమానతల పరిష్కారం, వృద్ధి, దారిద్యరం, భూతాపం తదితర అంశాలపై ఇందర్‌మిత్‌ గిల్‌ పని చేశారని ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు డేవిడ్‌మాల్‌పాస్‌ తెలిపారు. కార్మెన్‌ రెయిన్‌హర్ట్‌ స్థానంలో ఇందర్‌మిత్‌ గిల్‌ నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా నియమితులు కావడం తనకు ఎంతో గౌరవం అని తెలిపారు.

                 చికాగో యూనివర్సిటీ, జార్జిటౌన్‌ యూనివర్సిటీలో బోధకుడిగా ఇందర్‌మిత్‌ గిల్‌ ఉన్నారు. ఢల్లీిలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఎకనమిక్స్‌లో బీఏ, ఢల్లీి స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఎంఏ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోలో ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. కౌశిక్‌ బసు తర్వాత ప్రపంచ బ్యాంక్‌ ఎకనమిస్ట్‌గా నియమితులైన  రెండో భారత సంతతి ఆర్థిక వేత్త ఇందర్‌మిత్‌ గిల్‌ కానున్నారు.

Social Share Spread Message

Latest News