Skip to main content

Namaste NRI

జైత్ర మూవీ పాటను లాంఛ్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

సన్నీ నవీన్‌, రోహిణి రేచల్‌ జంటగా నటించిన చిత్రం జైత్ర. తోట మల్లికార్జున దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లం శ్రీతన్మయి సమర్పణలో అల్లం సుభాష్‌ నిర్మించారు. అధర నా గుండెల ధర అంటూ సాగే ఈ సినిమాలోని గీతాన్ని  స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌  బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్‌ సినిమాలు చూశాం. అయితే ఒక రైతు కథతో రూపొందిన ఈ చిత్రం జైత్ర.  సాంగ్స్‌, టీజర్‌ బాగున్నాయి. ఈ  సినిమా  విజయవంతం కావాలని ఆకాంక్షించారు.  మల్లికార్జున మాట్లాడుతూ మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథే ఈ సినిమా. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల చేయనున్నాం అన్నారు. వంశీ నెక్కంటి, సునీత మనోహర్‌ తదితరులు నటించారు.  ఈ చిత్రానికి సంగీతం: ఫణి కల్యాణ్‌, కెమెరా: మోహన్‌ చారి.

Social Share Spread Message

Latest News