Skip to main content

Namaste NRI

బంగార్రాజు .. వాసివాడి తస్సాదియా పిల్ల జోరు అదిరిందయ్య

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం బంగార్రాజు.  తాజాగా సినిమా నుంచి పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పేరుతో కొత్త పాటను విడుదల చేశారు. నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు మాకింకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు. నువ్వు శ్రీరాముడైపోతే బంగార్రాజు మాకింకెవ్వడు తీరుస్తాడు ముద్దుమోజు.. వాసివాడి తస్సదియ్యా అంటూ హుషారుగా ఈ గీతం సాగింది. ఈ పాటను కల్యాణ్‌ కృష్ణ రచించగా, మోహన భోగరాజు,  సాహితి చాగంగి, హర్షవర్ధన్‌ చావలి ఆలపించారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి స్టెప్పులేశారు.  ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్‌ గీతంగా ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ గీతానికి అనూప్‌రూబెన్స్‌ స్వరాల్ని అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: యువరాజ్‌, సంగీతం: అనూప్‌రూబెన్స్‌, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, దర్శకత్వం: కల్యాణ్‌ కృష్ణ. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇక 2019లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు స్రీక్వెల్‌గా బంగారాజ్రు తెరకెక్కుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events