Namaste NRI

టొరంటోలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు  ఘనంగా నిర్వహించారు. కెనడా తెలంగాణ వాసులు స్థానిక కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆరుఫీట్ల ఎత్తైన బతుకమ్మను పేర్చి , ఆట పాటలతో వేడుకలను ఉల్లాసంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడి ఊరేగింపు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమములో బోర్డు అఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజరర్‌ నవీన్ ఆకుల, కార్యవర్గసభ్యు లు, గిరిధర్ క్రోవిడి, ఉదయ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి , బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యు లు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాశ్‌ చిట్యాల, మనోజ్ రెడ్డి, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి, శ్రీనాథ్ కుందూరి పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఈద, సభ్యులు దీప గజవాడ నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. సంబరాలకు సహకరించిన సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సంబరాలలో దాదాపు 1200 కి పైగా కెనడా తెలంగాణ వాసులు  పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.

Social Share Spread Message

Latest News