Namaste NRI

తానా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ నగరంలో టైమ్స్ స్కేర్ లో ఈ నెల 8 తేదీ మధాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి వరకూ ఈ ఉత్సవాలు నిర్వహించారు. నటి అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మంగ్లీ పాడిన పాటలు, రమేష్ మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, పూర్వ అధ్యక్షుడు జయ్ తాళ్లూరి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నిరంజన్ తదితరుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు వేలమంది తరలివచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events