Namaste NRI

భాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ న్యూ ఏజ్ కాన్సెప్ట్ … చాలా ఫన్

విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం భాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వంత్ మాట్లాడుతూ న్యూ ఏజ్ అండ్ ఫన్ కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది. సంతోష్ హార్డ్ వర్క్ చేశారు. వేణు, నిరంజన్గార్లు పిల్లర్స్లా నిలబడ్డారు అన్నారు. ఓ కొత్త దర్శకుడికి కావాల్సిన మంచి కథ, మంచి ప్రొడక్షన్ ఈ సినిమాతో నాకు దొరికాయి. విశ్వంత్ నిర్మాతలు ఎంతగానో ప్రోత్సహించారు అన్నారు సంతోష్. తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్లో, యూఎస్లో వంద థియేటర్స్లో రిలీజ్ చేయనున్నాం అన్నారు వేణుమాధవ్. తన మనసుకు దగ్గరైన పాత్ర ఇదని కథానాయిక మాళవిక సతీషన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మాళవిక సతీషన్, వేణు మాధవ్, వెంకట్ బాల సరస్వతి, శ్రుతి, చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News