Namaste NRI

కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు  ప్రారంభమయ్యాయి. ఆలయంలోని బంగారు ధ్వజస్తంభం వద్ద ప్రధాన అర్చకుడు ధర్మేశ్వర్‌ గురుకుల్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా మూషిక పటానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఉత్సవాల నిర్వహణకు సకల దేవతలను ఆహ్వానిస్తూ మూషిక పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి ఆపై పంచామృతిభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి సమర్పించారు. మొదటి రోజున స్వామివారు హంస వాహనం అధిరోహించి పూజలందుకున్నారు. ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  దంపతులు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events